Wednesday, 12 August 2009

Movie : Magadheera

మగధీర :: 2009
సంగీతం::MM.కీరవాణి
రచన::చంద్రబోస్
గానం::MM.కీరవాణి,నికిత నిగం

ఆఆ... ఆ...

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొరా

అసమాన సాహసాలు చూడ రాదునిద్దురా
నియమాలు వీడి రాణివాసం
ఏలుకోరా ఏక వీర ధీరా

ధీరా ధీరా ధీరా మనసాగలేదురా
చేర రార శూరా సొగసందుకో దొరా

సమరములో దూకగ చాకచిక్యం నీదేరా
సరసములో కొద్దిగ చుపరా
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా
ఆధిపతి నై అదికాస్తా దోచేదా
కోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉంది గా
ఇక ప్రాయమైనా ప్రాణమైనా
అందుకోరా ఇంద్రపుత్రా

ధీరా ధీరా ధీరా మనసాగలేదురా
చేర రార శూరా సొగసందుకో దొరా

శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో కడ్గమే ఆడదా
మగసిరితో అందమే అంటు పెడితే అంతేగా
అణువణువు స్వర్గమే అయిపోదా
షాసనాలు ఆపజాలని తాపముందిగా
చెరసాలలోని ఖైదు కాని కాంక్ష మోందిగా
శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నన్ను చేరుకుంది రా
గుండెలో నగార ఇక మోగుతోంది రా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా
ప్రియా పూజలేవోచేసుకొనా
చేతులార సేదతీరా

ధీర ధీర ధీర
ధీర ధీర ధీర