Sunday, 19 July 2009
Kick 2009~~మనసే తడిసేలా
రచన::సిరివెన్నెల
సంగీతం::S.తమన్
గానం::వర్ధిని తమన్
మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా
సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా
కంటికి కనపడు ప్రాణమా
గుండెకు వినబడు మౌనమా
మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా
సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా
ఆగని జీవన గానమా
ఆ దేవుని వరదానమా
పదములు కలిపావే తెలిసే అర్దం నువ్వేనా
పరుగులు అలిసావే కలిసే తిరం నీవేనా