Monday, 20 July 2009

శంకర్ దాదా జిందాబాద్~~2007~~చందమామ కోసమే వేచి



సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::భాస్కరభట్ల
గానం::చిత్ర,వేణు

చందమామ కోసమే వేచి ఉన్న రేయిలా
వేయి కళ్ళతోటి ఎదురు చూడనా
వానజల్లు కోసమే వేచి ఉన్న పైరులా
గంపెడంతా ఆశతోటి చూడనా

జోలపాట కోసం..ఉయ్యాలలోన చంటి పాపలాగా
కోడి కూత కోసం..తెల్లారుజాము పల్లెటూరి లాగా
ఆగనేలేనుగా..చెప్పవా నేరుగా..గుండెలో ఉన్న మాట
ఎయ్..ఒకటి..ఆ రెండు..ఆ మూడు అంటూ..
అరె ఒక్కో క్షణాన్ని నేను లెక్కపెట్టనా
వెళ్ళు..ఆ వెళ్ళు..ఆ వెళ్ళు అంటూ
ఈ కాలాన్ని ముందుకే నేను తొయ్యనా
తొందరే ఉందిగా ఊహకైన అందనంతగా
కాలమా వెళ్ళవే తాబేలులాగ ఇంత నెమ్మదా..
నీతో ఉంటుంటే..నిన్నే చూస్తుంటే రెప్పే వెయ్య కుండా చేపపిల్లలా
కళ్ళెం వెయ్య లేని..ఆపే వీళ్ళేని కాలం వెళుతోంది జింకపిల్లలా
అడిగితే చెప్పవూ..అలిగినా చెప్పవూ..కుదురుగా ఉండనీవూ..
ఎయ్..ఒకటి..ఆ రెండు..ఆ మూడూ అంటూ..
అరె ఒక్కో క్షణాన్ని నేను లెక్కపెట్టనా
మూడు ..ఆ రెండు..ఆ ఒకటి అంటూ
గడియారాన్ని వెనక్కి నేను తిప్పనా..
ఎందుకో..ఏమిటో..నిన్న మొన్న లేని యాతనా
నా మదే ఆగదే నేను ఎంత బుజ్జగించినా
ఛీ పో..అంటావో..నాతో ఉంటావో..ఇంకేం అంటావో తెల్లవారితే
విసుక్కుంటావో..అతుక్కుంటావో..ఎలా ఉంటావో..లేఖ అందితే
ఇంక ఊరించకూ..ఇంత వేధించకూ..నన్నిలా చంపమాకు
ఎయ్..ఒకటి..ఆ రెండు..ఆ మూడు అంటూ ..
అరె ఒక్కో క్షణాన్ని నేను లెక్కపెట్టనా
మూడు..ఆ రెండు..ఆ ఒకటి అంటూ
గడియారాన్ని వెనక్కి నేను తిప్పనా