Monday, 20 July 2009

స్నేహ గీతం ~~ 2009~~ఒక స్నేహమే మము



స్నేహ గీతం ~~ 2009
రచన::సిరాశ్రీ
గానం::కార్తీక్
సంగీతం::సునీల్ కష్యప్


ఒక స్నేహమే మము కలిపే
ఒక బంధమే విరబూసే
సంతోషమే మది నిండే
నవలోకమే పిలిచిందే
ఏవో ఏవో ఏవేవో
ఎదలో కదిలే కధలేవో
ఏవో ఏవో ఏవేవో
ఎదురై నిలిచే కలలేవో

ఒక స్నేహమే మము కలిపే
ఒక బంధమే విరబూసే

ధేయం ధ్యానం ఒకటై సాగే
లక్ష్యం గమ్యం ఒకటై ఆడే
ఒక చెలిమి కోసం .....వేచే క్షణం
ఒక చెలియ కోసం .....జరిపే రణం

ఏవో ఏవో ఏవేవో
ఎదలో కదిలే కధలేవో

ఒక స్నేహమే మము కలిపే
ఒక బంధమే విరబూసే

స్నేహం ప్రేమై మారే వైనం
జతగా కలిసి చేసే పయనం
ఒక నవ్వు కోసం ఒ సంబరం
ఒక మెప్పు కోసం పెను సాహసం
ఓ ఓ ఓఓఓ

ఏవో ఏవో ఏవేవో
ఎదలో కదిలే కధలేవో

ఒక స్నేహమే మము కలిపే
ఒక బంధమే విరబూసే

హ్రుదయం లోనె మెరిసే స్వప్నం
ప్రణయం వరమై తెలిపే సత్యం
ఎద పుటలపైన ఓ సంతకం
మది నదులు కలిసే ఈ సంగమం

ఏవో ఏవో ఏవేవో
ఎదలో కదిలే కధలేవో
ఏవో ఏవో ఏవేవో
ఎదురై నిలిచే కలలేవో