Sunday, 19 July 2009

అష్ట చెమ్మ~~2008~~హల్లో అంటూ పిలిచి



సంగీతం::కల్యాణి మల్లిక్
రచన::సిరివెన్నెల
గానం::శ్రీకృష్ణ ,సుష్మా

హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి..ఎందుకు నీతో పేచి
ఇచ్చేదేదొ ఇచ్చి వచ్చెయ్ నాతో రాజీ

కోలకంటి చూపా కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా తాళవాప్ర తాపా
బెదరకే పాపా..వదలని కైపా
నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన
మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొ్చ్చి కీడేంచి మేలెంచి
హెల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
ఎందరినేం మారుస్తాం..ఇంద్రజాలం చేస్తాం
తిమ్మిని బమ్మిని చేద్దాం..మన్మధ మంత్రం వేద్దాం
రేయి లాంటి మైకం కప్పుకొని ఉందాం
మాయదారి లోకం కంట పడదందాం
మన ఏకాంతం..మనకే సోంతం
ఆష్ట దిక్కులన్ని దుష్ట శక్తుల్లల్లే కట్టకట్టుకొచ్చి చుట్టుముట్టుకుంటే యుద్ధానికి సిద్దం అనుకుందాం
పద్నాలుగు లోకాలను మొత్తం..ముద్దుల్లో ముంచేద్దాం
ఆరా తీసేవాళ్ళు పారా కాసేవాళ్ళు దారంతా ఉంటారు ఔరా జాగర్త

పిల్లకి మెళ్ళో పుస్తే కట్టేదెప్పుడంట పిల్లికి మెళ్ళొ గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవె చిట్టీ..చంపకు ఊదరగొట్టి
దగ్గర దగ్గర ఉండి..తగ్గదు బాదర బంది

ఆవురావురందీ ఆకలాగనందీ
ఆవిరెక్కువుందీ అంటుకోకు అందీ
తట్టుకోడమెల్లా..ముట్టుకుంటే డిల్లా
విస్తరాకు నిండ విస్తరించి ఉన్న విందు చూసి కూడా పస్తులుండమని ఎవ్వరిది శాశించిన పాపం
ఎవ్వరిపై చూపిస్తాం కోపం..ఐనా పెడతా శాపం

హెల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి..ఎందుకు నీతో పేచి
అచ్చేదేదో ఇచ్చి..వచ్చేయ్ నాతో రాజీ
కోలకంటి చూపా కొత్త ఏటిచేపా
పూలవింటి తూపా తాళవాప్ర తాపా
బెదరకె పాప..వదలని కైపా
నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి..కీడేంచి మేలేంచి
హల్లో అంటూ పిలిచి కల్లోల్లం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి