Monday, 20 July 2009

గమ్యం~~2007~~సమయమా...చలించకే



సంగీతం::ES.మూర్తి,R.అనిల్
రచన:::సిరివెన్నెల
గానం:::సుజాత

సమయమా...చలించకే
బిడియమా...తలొంచకే

సమయమా ...చలించకే
బిడియమా ...తలొంచకే
తీరం ఇలా తనకు తానే
తీరం ఇలా తనకు తానే
వెతికి జతకి చేరే క్షణాలలో

సమయమా...చలించకే
బిడియమా...తలొంచకే

చంటిపాపలా అనుకుంటూ ఉండగానే
చందమామలా కనుగొన్నా గుండెలోనే
తనలో చిలిపితనం సిరివెన్నెలే అయేలా
ఇదుగో కలలవనం అని చూపుతున్న లీలలో

సమయమా..చలించకే

పైడిబొమ్మలా నను చూసే కళ్ళలోనే
ఆడజన్మలా నను గుర్తించాను నేనే
తనకే తెలియదనీ నడకంటే నేర్పుతూనే
నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలో

సమయమా...చలించకే
బిడియమా...తలొంచకే
సమయమా...చలించకే
బిడియమా...తలొంచకే