Monday, 20 July 2009

ప్రేమలేఖ~~1997~~ప్రియా నిను చూడలేకా..



Director: : Agastyan
సంగీతం::దేవ
రచన::భువన చంద్ర
గానం::అనురాధ శ్రీరాం,SP.బాలు

ప్రియా నిను చూడలేకా..
ఊహలో నీ రూపు రాకా..
నీ తలపు తోనే.. నే బతుకుతున్నా !
నీ తలపు తోనే నే బతుకుతున్నా !!
!! ప్రియా నిను చూడలేకా !!

వీచేటీ గాలులను..నేనడిగానూ నీ కుశలం
ఉదయించే..సూర్యుడినే..నేనడిగానూ నీ కుశలం
అనుక్షణం నా మనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీ కధలే
కనులకు నిదురలే కరువాయె
!! ప్రియా నిను చూడలేకా !!

కోవెలలో..కోరితినీ..నీ దరికీ నను చేర్చమనీ
దేవుడినే..వేడితినీ..కలకాలం నిను చూడమ
నీలేఖతో ముద్దైనా అందించరాదా
నిను గాక లేఖలనీ పెదవంటుకోనా
వలపులూ నీ దరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చునులే

ప్రియా నిను చూడలేకా..
ఊహలో నీ రూపు రాకా..
నీ తలపు తోనే.. నే బతుకుతున్నా
నీ తలపు తోనే నే బతుకుతున్నా
ప్రియా నిను చూడలేకా
ఊహలో నీ రూపు రాకా !!